హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: న్యాయం చేయకపోతే ఆత్మహత్యే

MLG : గోవిందరావుపేట మండలంలో విష గుళికలు కలిసిన బాలామృతం తిని ఏప్రిల్‌లో ఇరుగు అశ్రీత్ నందన్ మృతి చెందాడని తండ్రి శ్రావణ్ తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని సెల్ఫీ వీడియోలో కోరారు. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను చంపేందుకు తెచ్చిన మందు అంగన్‌వాడీలో ఉండటమే ఘటనకు కారణమని, సర్పంచ్, ఉపసర్పంచ్ బాధ్యత వహించాలని ఆరోపించారు.