ASF: బెజ్జూర్ మండల రజక సంఘం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా రామడుగుల రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజక సంఘం కులస్తులు నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘం అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘం కులస్తులందరూ అధ్యక్షుడిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
రజక సంఘం మండల అధ్యక్షుడిగా రమేష్


