హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం

NRPT: ధన్వాడ ప్రభుత్వ మోడల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత వారు అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది వెంటనే నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు అసలు కారణం తెలియాల్సి ఉంది.