హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

ADB: ప్రజలందరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండి హక్కులను సాధించుకోవాలని న్యాయవాది సందీప్ కుమార్ అన్నారు. శనివారం బోథ్ మండలంలోని నిగిని, కైలాస్‌టెక్డి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, లోక్ ఆదాలత్ తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.