హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల అభివృద్ధికి సహకారం.. దంపతులకు సన్మానం

SRCL: చందుర్తి మండలంలోని ఎస్సీ కాలనీ మరిగడ్డ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రతి ఏటా సహకారం అందిస్తున్న స్థానిక ఉపాధ్యాయ దంపతులు చంద్రకళ, నర్సయ్యలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి వారు అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ దూది మనీషా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయురాలు భార్గవి తదితరులు పాల్గొన్నారు.