హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ గోడపత్రికల ఆవిష్కరణ

BHNG: మోత్కూర్‌లో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం గోడపత్రికలు ఆవిష్కరించారు. మండల కార్యదర్శి జిట్టా గౌతం మాట్లాడుతూ.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.