హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చాకిరేవు గుట్టను అభివృద్ధి చేయాలి'

HNK: నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టను సంరక్షించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పగడాల కాళీ ప్రసాద్‌రావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ గుట్టపై అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకునేందుకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రకృతి సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.