ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామ యువతకు శనివారం పోలీసులు క్రీడా సామాగ్రిని అందజేశారు. యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో వాలీబాల్ నెట్, క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ప్రతిఒక్కరు క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. కార్యక్రమంలో సీఐ అంజమ్మ, ఎస్సై శ్రీసాయి పాల్గొన్నారు.
తెలంగాణ
స్పోర్ట్స్ కిట్ అందజేసిన ఎస్పీ


