హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

PDPL: వరి సాగులో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో PDPLలో నిర్వహించిన 'వరి వరహాలు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వరి సాగులో నీటిని సమర్థవంతంగా వినియోగించిన రైతులకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకమందించారు. ప్రపంచ మార్కెట్‌తో మన ఉత్పత్తులు పోటీపడాలన్నారు.