హైదరాబాద్: 28°C
తెలంగాణ

51 నైవేద్యాలతో పూజలు

MNCL: దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 51 నైవేద్యాలతో మహిళలు, భక్తులు పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా దండేపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం మధ్యాహ్నం మహిళలు, భక్తులు 51 నైవేద్యాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. పలు గ్రామాలలోని వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు చేశారు.