NGKL: కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మూడు, నాలుగు రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం గ్రామ కార్యదర్శి బి. బాల పీర్, మాజీ ఉపసర్పంచ్ పి. చంద్రునాయక్ తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: తాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన


