WNP: అమరచింత మండలం క్యాంప్ వద్ద జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు పరిధిలోని రైతులు ధర్నా చేపట్టారు. వారం రోజుల నుంచి పంటలకు నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల ధర్నా


