హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికవరీ ఏజెంట్ల నిర్వాకం.. బైక్ తాకట్టుపెట్టి..!

ADB: ఆదిలాబాద్‌లోని ధృవీక ఎంటర్‌ప్రైజెస్ రికవరీ ఏజెన్సీలో ఏజెంట్లుగా పనిచేస్తున్న షేక్ ఉబైద్ ఉల్లా, షేక్ అబ్దుల్ నయీంలు రికవరీ చేసిన పల్సర్ బైక్‌ను సంస్థకు ఇవ్వకుండా రూ.30 వేలకు తాకట్టు పెట్టినట్లు CI సునీల్ కుమార్ శనివారం తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి యువత చెడు మార్గంలో వెళ్ళవద్దని కోరారు.