BDK: భద్రాచలంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరగనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. నేడు గోదావరి తీరంలోని నిమజ్జన ఘాట్లను పరిశీలించిన ఆయన, లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
తెలంగాణ
నిమజ్జన ఘాట్లను పరిశీలించిన కలెక్టర్


