హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ నృత్య పోటీల్లో అనిశ్రిత ప్రతిభ

హన్మకొండకు చెందిన కుందూరు అనిశ్రిత రెడ్డి జాతీయ స్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ చాటింది. హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలలో నిర్వహించిన ద్యుతి–నేషనల్ లెవల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్–ఆంగికం–2026లో అన్ని కళారూపాల విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. రూ.10వేల నగదు పురస్కారాన్ని అందుకుంది. అనిశ్రిత రెడ్డిని నాట్య గురువు హిమాన్సీ అభినందించారు.