హైదరాబాద్: 28°C
తెలంగాణ

చీలపల్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: MLC

ASF: సిర్పూర్‌(టి) మండలంలోని చీలపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు MLC దండే విఠల్ తెలిపారు. శనివారం చీలపల్లి వెళ్లే మార్గంలోని 2 వాగులపై కల్వర్టుల నిర్మాణానికి కలెక్టర్ నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో రెండు వాగులపై కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.