ASF: జైనూర్ మండలం జాంనీ గ్రామానికి చెందిన ముండే రజనీకాంత్(35) వాగులో గల్లంతైన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గణేష్ నిమజ్జనం కోసం వాగు వద్దకు వెళ్లిన రజనీకాంత్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. పోలీసులు శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం అతని మృతదేహం లభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి తదుపరి చర్యలు చేపట్టారు.
తెలంగాణ
గల్లంతైన మృతదేహం లభ్యం


