హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొద్దంలో రైతు సమస్యలపై ధర్నా

సత్యసాయి: రొద్దం మండలంలో రైతుల సమస్యలపై ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో విద్యుత్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు భరోసా, పంట బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, గిట్టుబాటు ధర, సాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెనుకొండ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఉచిత పశుగ్రాసం అందించాలని డిమాండ్‌ చేశారు.