హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కల్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

KMR: సదాశివనగర్‌ మండలం మార్కల్‌ గ్రామంలో బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణం, కమ్యూనిటీ సోక్‌పిట్‌, అంగన్‌వాడీ మరుగుదొడ్డి పనులను DRDA పీడీ దామోదర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. పనుల వివరాలను పరిశీలించి పూర్తయిన పనులను రికార్డుల్లో నమోదు చేయాలని ఈసీ, ఏఈలకు సూచించారు. పనుల నమోదును త్వరితగతిన పూర్తి చేసి, నిబంధనల ప్రకారం బిల్లుల చెల్లింపులు చేపట్టాలని ఆదేశించారు.