హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మె ఎఫెక్ట్.. రైతులు, కోళ్ల వ్యాపారుల అవస్థలు

WGL: జిల్లాలో రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మెతో రైతులు, కోళ్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10 నుంచి తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపుతో మిల్లులు మూతపడ్డాయి. దీంతో ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం, తౌడు, కనుక కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని శనివారం బాధితులు తెలిపారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కోళ్లు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.