హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సుఖసంతోషాల కోసం మాజీ మంత్రి ప్రార్థన

ADB: జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రతిష్టించి ఏర్పాటు చేసిన గణనాథుడిని మాజీ మంత్రి జోగు రామన్న శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక BRS నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయకుడి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.