ఖమ్మం డిపో కండక్టర్ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన స్వామినేని లక్ష్మీనారాయణ శనివారం హైదరాబాద్ బస్ స్టేషన్‌లో విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటు వచ్చింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణంతో డిపో సిబ్బంది, ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ ఆకస్మిక మృతి..!


