హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాంటేషన్‌ను పరిశీలించిన డీఆర్డీవో

WGL:గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన యూకలిప్టస్, మునగ ప్లాంటేషన్ ను జిల్లా డీఆర్డీవో పద్మజ పరిశీలించారు. ఈసీ, టీఏలతో కలిసి మొక్కల పెరుగుదల, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్లాంటేషన్ ను మరింత అభివృద్ధి చేసి ఆదాయ వనరుగా మార్చుకోవాలని సర్పంచ్, సిబ్బందికి సూచించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.