హైదరాబాద్: 28°C
తెలంగాణ

బచ్చన్నపేటలో 'వనజీవి' షూటింగ్

JN: పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'వనజీవి' చిత్ర షూటింగ్ బచ్చన్నపేటలో సాగింది. రామయ్య పాత్రలో నటిస్తున్న హీరో బ్రహ్మాజీపై కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో చిత్ర యూనిట్ మొక్కలు నాటింది. రామయ్య జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ సినిమా తీస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.