హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో వింత వాతావరణం

MDK: రామాయంపేట మండల కేంద్రంలో శనివారం వింత వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణంలో వచ్చిన మార్పు ఊరటనిచ్చింది. అయితే పట్టణ శివారులో భారీ వర్షం కురియగా, పట్టణంలో మాత్రం వర్షం పడకపోవడం గమనార్హం. ఈ విచిత్ర పరిస్థితిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.