హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామివారిని దర్శించుకున్న వెలిచాల దంపతులు

KNR: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. కరీంనగర్ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.