హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా మార్ట్ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KMM: తల్లాడలో నిర్మాణంలో ఉన్న మహిళా మార్ట్ పనులను శనివారం అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘాలు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే మహిళా మార్ట్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీధర్ ను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.