కృష్ణా: కోడూరు ప్రధాన కూడలిలో లంబోదర యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గణనాధుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న యువకులను వెంకట్రామ్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరులో ఘనంగా గణపతి నవరాత్రులు


