హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

JGL: జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ అభివృద్ధి పనులపై శనివారం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమీక్షసమావేశం నిర్వహించారు. పట్టణంలో అవసరమైన నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా నీరు అందించడం, నూతన వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ల నిర్మాణం, పారిశుద్ధ్యంపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.