హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణపై తల్లులకు అవగాహన

JGL: జాతీయ పోషణ మాసంలో భాగంగా జగిత్యాల అర్బన్-2 ఐసీడీఎస్ పరిధిలోని 49వ వార్డులో తల్లుల అనుభవాల పంచుకునే కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన పిల్లల తల్లులు, పోషణ లోపం ఉన్న పిల్లల తల్లులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.