హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పాజీపల్లిలో పోషణ మాసోత్సవం

MDK: విద్యార్థులు రక్తహీనత బారిన పడకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని అప్పాజీపల్లి పాఠశాలలో పిలుపునిచ్చారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సులో డాక్టర్ సారిక, సర్పంచ్ రవికుమార్ మాట్లాడారు. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.