హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: త్వరలో ఆదిలాబాద్ IT టవర్ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా యువతకు స్వగ్రామంలోనే ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మంజూరైన ఆదిలాబాద్ ఐటీ టవర్ నిర్మాణం పూర్తయింది. అయితే భవనం ప్రారంభం ఆలస్యం కావడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు వాయిదా పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్‌ బోర్డు సమీపంలో, బట్టీసావర్‌గాం వద్ద జాతీయ రహదారికి ఆనుకొని 3 ఎకరాల్లో ఈ టవర్‌ను నిర్మించారు.