హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశుగ్రాసం కొరత.. కబేళాకు పశువులు!

VKB: వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పశువులను రైతులు కబేళాకు తరలిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కుల్కచర్ల మండలం వ్యాప్తంగా కరెంట్ కష్టాలు అధికమయ్యాయని, వేసిన పంటలు ఎండిపోతున్నాయని పశువులను మేపేందుకు గడ్డి లేక ఏదారీ లేక అమ్మేస్తున్నామని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేయడం రాబోయే రోజుల్లో రైతులకు మరింత ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.