VZM: విజయనగరంలో కేటుగాళ్లు ‘అన్నదానం’ పేరుతో టెంట్‌హౌస్ యజమానిని మోసం చేశారు. రూ.1,000 అడ్వాన్స్ ఇచ్చి రూ.60 వేల విలువైన సిల్వర్ టబ్బులు, మూతలను ఆర్డర్ చేశారు. డెలివరీకి వెళ్తున్న రిక్షాను మార్గమధ్యలో అడ్డుకుని సరుకును అపహరించారు. బాధితుడు ఫోన్ చేయగా నంబర్ నకిలీదని తేలింది. ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఆంధ్రప్రదేశ్
‘అన్నదానం’ పేరుతో మోసం


