హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజుపేటలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

MLG: మంగపేట మండలం రాజుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం 49 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు పంపిణీ చేశారు. హెచ్‌ఎం చోలం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందించేందుకు ఏకరూప దుస్తులు దోహదపడతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.