హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనానికి నీటి కొరత

KDP: వైఎస్సార్ జిల్లాలో కరువు పరిస్థితుల ప్రభావం వినాయక నిమజ్జనాలపైనా పడింది. చెరువులు, వాగుల్లో నీరు లేకపోవడంతో విగ్రహాల నిమజ్జనానికి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఎండిపోయిన చెరువుల్లో వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యత లేక భక్తులు ఎండిన చెరువుల్లోనే విగ్రహాలను వదిలేస్తున్నారు.