హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి

AKP: చెరువుల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని కోటవురట్ల మండల ప్రత్యేక అధికారి శోభారాణి, ఎంపీడీవో చంద్రశేఖర్ కోరారు. శనివారం కైలాసపట్నం ఊర చెరువు వద్ద క్లాప్ మిత్రలతో తుప్పలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయించారు. చెరువులో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.