TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక నిందితుడిని ఈడీ అరెస్ట్ చేసింది. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరాలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. పామాయిల్, రసాయనాలతో నెయ్యి తయారు చేసి తప్పుడు రికార్డులు సృష్టించినట్లు ఈడీ ఆరోపించింది.


