హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వైభవంగా జరగనున్న గరుడ సేవ

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరగనుంది. గరుడ సేవను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. 190 గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రీవారి గరుడ సేవను వీక్షించడానికి ముక్కోటి దేవతలు తిరుమలకు తరలి వస్తారని విశ్వాసం.