VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో శనివారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి, పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో కమనీయంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నేత్రపర్వంగా సహస్రనామార్చన సేవ


