హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దనకుంటలో తాగునీటి ఎద్దడి

సత్యసాయి: గుడిబండ మండలం మద్దనకుంట గ్రామంలో గత రెండు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం కొత్త బోర్ వేయించినప్పటికీ, పాత బోరులోని మోటార్ పంపులను అందులో అమర్చడంలో స్థానిక నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.