హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల భవనం పూర్తిచేయాలని వినతి

PPM: కురుపాం మండలం తిత్తిరి గ్రామ జీపి పాఠశాల భవనం పూర్తయినా గచ్చులు వేయకపోవడంతో 22 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవనం ముందు గోడ, తలుపులను గ్రామస్థులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్పందించి గచ్చులు వేయించి భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.