హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గడపగడపకు వైసీపీ'

NTR: తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం ‘గడపగడపకు’ కార్యక్రమం నిర్వహించారు. 15వ వార్డు భగత్‌సింగ్ నగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంపై కూటమి నాయకుల తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.