హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం సత్యదేవుని అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కాకినాడ: అన్నవరం సత్యనారాయణ స్వామివారి అన్నదాన పథకానికి శనివారం కాకినాడ గ్రామానికి చెందిన నిమ్మగడ్డ సురేష్ బాబు వారి కుటుంబ సభ్యులు రూ. 1,00,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, దాతలకు స్వామివారి దర్శనం కల్పించి ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 27న ఈ నిధులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని దాతలు కోరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.