హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లైసెన్స్ రెన్యువల్‌కు 21 వరకు గడువు'

అన్నమయ్య జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యువల్‌కు ఈ నెల 21 వరకు అవకాశం ఉందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఏఈఎస్‌ జోగేంద్ర తెలిపారు. జిల్లాలో 115 దుకాణాలకు రెన్యువల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దరఖాస్తులు అందాయని తెలిపారు. మిగిలిన లైసెన్సుదారులు గడువులోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.