హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలతో జలకళ సంతరించుకున్న జలపాతం

ASR: గుర్తేడు మండలం రాకోట సమీపంలోని జలపాతం ఇటీవల కురిసిన వర్షాలతో జలకళను సంతరించుకుని పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గుర్తేడు గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతానికి రోడ్డు సౌకర్యం లేక పర్యాటకులు కాలినడకన చేరుకోవాల్సి వస్తోంది. అధికారులు రోడ్డు నిర్మిస్తే ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు కోరుతున్నారు.