హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాల్వలోకి దూసుకెళ్లిన కారు!

GNTR: తెనాలి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం మహిళ కారు నడుపుతుండగా మధ్యలో బైక్‌ను తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాల్వలో పడిన కారును గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.