హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల గుంపుతో రైతుల్లో భయం

PPM: పార్వతీపురం మండలం జమదాల గ్రామ సమీపంలోని జంతికొండ వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది శనివారం తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్ సాగు సమయం కావడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.