నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో ఇవాళ ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సదరు వ్యక్తి కళ్లలో కారం చల్లిన గుర్తు తెలియని వ్యక్తులు కిందపడేలా చేశారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పొలాల్లోకి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య!


