కృష్ణా: తోట్లవల్లూరులో విషసర్పం కాటుకు కౌలు రైతు మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పోతురాజు రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మినుము సాగు చేస్తున్నాడు. ఈ నెల 16న పొలంలో కలుపు మందు పిచికారీ చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటుతో వ్యక్తి మృతి


